Jawaharnagar: తాపీ మేస్త్రీలను 'దళారులు' అనడం దురదృష్టకరం: సెంట్రింగ్ మేస్త్రీలు బహిరంగ క్షమాపణ చెప్పాలని కార్మిక సంఘం డిమాండ్!
Jawaharnagar: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో తాపీ మేస్త్రీలను 'దళారులు' అని వ్యాఖ్యానించడంపై భవన నిర్మాణ కార్మిక సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
జవహర్ నగర్ (అల్వాల్): ఇంటి నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషించే తాపీమేస్త్రి లపై , సెంట్రింగ్ మేస్త్రీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను భవన నిర్మాణ కార్మిక సంఘం తీవ్రంగా ఖండించింది. జవహర్ నగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు కొయ్యడ వెంకటేష్,అధ్యక్షులు చెన్నాపురం యాదయ్య,ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్ ఇతర సంఘ నాయకులు మాట్లాడారు.
వివాదానికి కారణం:
ఇటీవల ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఖర్చుల విషయంలో తాపీ మేస్త్రీలకు, సెంట్రింగ్ మేస్త్రీలకు మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో మేస్త్రీలను ఉద్దేశించి 'బ్రోకర్లు', 'దళారులు' అంటూ కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలు కార్మిక వర్గాన్ని తీవ్రంగా గాయపరిచాయని బూడిద వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక ఇల్లు నిర్మించడంలో మేస్త్రీ అనే వ్యక్తి ఆ ఇంటికి పెద్దమనిషి లాంటివాడు. అలాంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మేస్త్రీలను దళారులతో పోల్చడం చాలా బాధాకరం. ఈ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము."
భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు
కార్మిక సంఘం డిమాండ్లు:
వ్యాఖ్యల ఉపసంహరణ: మేస్త్రీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి.
బహిరంగ క్షమాపణ: కార్మికుల మనోభావాలను దెబ్బతీసినందుకు సెంట్రింగ్ మేస్త్రి లు వెంటనే క్షమాపణ చెప్పాలి.
ఆందోళన హెచ్చరిక: ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో భవిష్యత్తులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కలిసికట్టుగా ముందుకు..
ఈ సందర్భంగా కొయ్యడ వెంకటేష్ మాట్లాడుతూ, చిన్న చిన్న మనస్పర్ధలు పక్కన పెట్టి సెంట్రింగ్ మేస్త్రీలు, తాపీ మేస్త్రీలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ సమావేశంలో ఎ ఐ ఎఫ్ టీ యూ రాష్ట్ర నాయకులు వై. మల్లేష్,గౌరవఅధ్యక్షులు:
కొయ్యడ వెంకటేష్అధ్యక్షులు:కీసర
సర్కిల్ నాగునూరి యాదయ్య
ఉపాధ్యక్షులు:
సి. హెచ్. రమణారెడ్డి మరాఠిబాబు
ప్రధాన కార్యదర్శి:
బూడిద వెంకటేశ్ కోశాధికారి:
కోట్ల చెన్నారెడ్డి
సంయుక్త కార్యదర్శి :దుబాయి శ్రీను
బోడ శ్రీనివాస్వి. మురళి శాంతయ్య
ప్రచార కార్యదర్శులు :ఆర్. రాములు కావురి కుమార్
టి. రామస్వామిరమేష్ మేస్త్రీ
సలహాదారులు :వై. మల్లేశ్
కొయ్యడ ఐలయ్య
సోడె కుమార్యం. మాధవ్
కార్యవర్గ సభ్యులు:ఆర్. యాదగిరిఎన్. యాదగిరి
సాదుల్లా కుమ్మరి బాబు
నర్సింహ్మ మామిడి కొండయ్య
బల్ఫు ప్రసాద్,
పి. రమేష్. తదితరులు పాల్గొన్నారు




