Vanasthalipuram: నాపై నిందలు వేయకండి విచారణ జరిపి చర్యలు తీసుకోండి: జానయ్య గౌడ్
Vanasthalipuram: వనస్థలిపురం సాహెబ్ నగర్ ప్లాట్ల వివాదంపై జానయ్య గౌడ్ స్పందన. రెండేళ్లుగా రూ.2 కోట్లు వడ్డీలు చెల్లించామని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్.
Vanasthalipuram: నాపై నిందలు వేయకండి విచారణ జరిపి చర్యలు తీసుకోండి: జానయ్య గౌడ్
Vanasthalipuram: తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వనస్థలిపురం సాహెబ్ నగర్ ఆఫీసర్ కాలనీ లోని సర్వే నెంబర్ 68, ఫ్లాట్ నెంబర్ 39,40 లోని 400గజాల భూమి ను రెండేళ్లుగా పెట్టుబడులు పెట్టి వడ్డీల రూపంలో సుమారు రూ.2 కోట్లు చెల్లించామని తెలిపారు. తాము ఎంతకాలం ఇలా బాధపడుతూ ఉండాలని ప్రశ్నించారు. ఆఫీసర్స్ కాలనీ లోని కాలనీ వాసులు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారని ఆరోపించారు.
మమ్మల్ని మోసం చేశారో.. విచారణ చేయండి
తాము భవనాల కోసం డబ్బులు చెల్లించిన విషయంపై ఎవరైనా ప్రశ్నలు ఉంటే సంబంధిత వ్యక్తుల వద్దకు వెళ్లి విచారణ చేయాలని బాధితులు కోరారు. తమ వద్దకు వచ్చి రాతపూర్వకంగా వివరాలు అడిగితే తాము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఆన్‌లైన్ ద్వారా ఒక్కొక్కరికి సుమారు రూ.60 వేల చొప్పున చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తులందరూ బహిరంగంగానే ఉన్నారని, ఎలాంటి రహస్య లావాదేవీలు జరగలేదని చెప్పారు.
విచారణ జరిపి తప్పు తేలితే చర్యలు తీసుకోండి
తాను చేస్తున్నది న్యాయమా అన్యాయమా అనే విషయాన్ని విచారణ ద్వారా తేల్చాలని కోరారు. వ్యవస్థ మొత్తం అధికారుల వద్దే ఉందని, సమగ్ర విచారణ జరిపి నివేదిక తెప్పించాలని విజ్ఞప్తి చేశారు.
తాను తప్పు చేసినట్లు విచారణలో తేలితే తనపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే తన శాఖకు చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతో తాను సెలవు పెట్టుకున్నానని తెలిపారు.
సస్పెండ్ చేశారని.. డిస్మిస్ చేశారని ప్రచారం
తాను సెలవులో ఉండటాన్ని కొందరు సస్పెండ్ చేశారని, మరికొందరు డిస్మిస్ చేశారని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా అనారోగ్య కారణాలతో సెలవు పెట్టుకున్నానని, అది సాధారణ ప్రక్రియలో భాగమేనని వివరించారు.
తనపై నిజంగా ఏదైనా ఆరోపణ ఉంటే శాఖాపరమైన విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది
తనపై జరుగుతున్న ప్రచారంతో తాను బాధపడటం లేదని, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, తమకు న్యాయం చేయాలని కోరారు.




