Ravichedu: రావిచేడ్‌లో ఘనంగా ‘జల మహోత్సవ’ ర్యాలీ.. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన!

Ravichedu: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్‌లో ఘనంగా జల మహోత్సవ ర్యాలీ.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Sept 2026 11:37 AM IST
Ravichedu
X

Ravichedu: రావిచేడ్‌లో ఘనంగా ‘జల మహోత్సవ’ ర్యాలీ.. నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన!

రంగారెడ్డి: ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ అన్నారు. గురువారం కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో సర్పంచ్ గోపాల్ ఆధ్వర్యంలో జల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జల మహోత్సవం నీటి పొదుపు పై ప్రజలకు అవగాహన ప్రతిజ్ఞ చేశారు. అవగాహన ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించడంలో మిషన్ భగీరథ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.. నీటి సంరక్షణతో పాటు సహజ వనరుల పరిరక్షణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. ఎల్ నినో వర్షాభావ పరిస్థితిని అధిగమించేందుకు జల సంరక్షణకు ఇంకుడు గుంతలు, నీటకుంటలు నిర్మించుకోవాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ జయశ్రీ, ఉప సర్పంచ్ బందరి యాదయ్య, మాజీ ఎంపీటీసీ యాదయ్య, వార్డు సభ్యులు హనుమంతు నాయక్, అనిల్, నాయకులు పాండు, సాయికుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి తిరుపతి నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, మిషన్ భగీరథ సిబ్బంది శివలింగం, సురేష్, సాయి, తదితరులున్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story