Hyderabad: జైపాల్ రెడ్డి వర్ధంతి స్ఫూర్తి స్థల్‌ వద్ద నివాళులర్పించిన పొన్నం

Hyderabad: జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా స్ఫూర్తి స్థల్‌లో నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

RAJESH,	WEST ZONE
Published on: 28 July 2026 5:07 PM IST
Hyderabad
X

Hyderabad: జైపాల్ రెడ్డి వర్ధంతి స్ఫూర్తి స్థల్‌ వద్ద నివాళులర్పించిన పొన్నం

హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత జైపాల్ రెడ్డి గారి 7 వ వర్ధంతి సందర్భంగా స్పూర్తి స్థల్ లో ఆయన స్మారకానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. దేశంలోనే ఎంతో ఆదరణ పొందిన నాయకుడిగా, లోక్‌సభ మరియు రాజ్యసభల్లో ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో, పదునైన ప్రసంగాలతో గళమెత్తిన మేధావి అత్యుత్తమ పార్లమెంటేరియన్.

15 వ లోక్ సభ లో తో పార్లమెంట్ సభ్యుడిగా మేము కొత్తగా పార్లమెంట్ లో అడుగుపెట్టినపుడు ఆయన మాకు ఎంతో స్ఫూర్తి కలిగించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియలో మరియు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో జైపాల్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు.

జైపాల్ రెడ్డి గారు తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ సిద్ధాంతాలు, నైతిక విలువలు, మచ్చలేని నిబద్ధతతో పనిచేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story