Madhapur: ఇనార్బిట్ మాల్ వద్ద డ్రగ్స్ విక్రయం ఐటీ ఉద్యోగి అరెస్ట్!

Madhapur: మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగి షేక్ అమ్నహ్మద్ అరెస్ట్. 7 గ్రాముల ఎండిఎమ్ఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 25 Aug 2026 10:36 AM IST
Madhapur
X

Madhapur: ఇనార్బిట్ మాల్ వద్ద డ్రగ్స్ విక్రయం ఐటీ ఉద్యోగి అరెస్ట్!

Madhapur: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనార్బిట్ మాల్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న 23 ఏళ్ల ఐటీ ఉద్యోగి షేక్ అమ్నహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులనే టార్గెట్‌గా చేసుకుని ఈ ముఠా డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అమ్నహ్మద్ వద్ద నుంచి లక్ష రూపాయల విలువ చేసే 7 గ్రాముల MDMA డ్రగ్ మరియు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న డ్రగ్ పెడ్లర్లు అమిర్, రాహీల్ మరియు వినియోగదారుడైన మధు కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story