Malkajgiri: మల్కాజిగిరి తొలి మహిళా సీపీగా సుమతి ఐపీఎస్
Malkajgiri: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ సుమతి బాధ్యతలు స్వీకరించారు.
Malkajgiri: మల్కాజిగిరి తొలి మహిళా సీపీగా సుమతి ఐపీఎస్
Malkajgiri: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు నూతన కమిషనర్‌గా సుమతి (IPS) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మల్కాజిగిరి కమిషనరేట్‌కు ఇప్పటికే ఉన్న శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ, మరింత సమర్థవంతమైన పోలీసింగ్ అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
మొదటి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్న ఆమె, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. టెక్నాలజీ వినియోగంతో క్వాలిటీ పోలీసింగ్ అందిస్తామని తెలిపారు.
మల్కాజిగిరి పరిధిలో ట్రాఫిక్ సమస్య ప్రధాన అంశంగా ఉన్నట్లు గుర్తించామని, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అదేవిధంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, సైబర్ క్రైమ్‌లపై రిపోర్టింగ్ మరియు స్పందనను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీస్ మేనేజ్‌మెంట్‌ను విస్తరించి, సిబ్బంది సమన్వయంతో టీమ్‌గా పనిచేస్తూ కమిషనరేట్ ప్రతిష్టను మరింత పెంచుతామని సుమతి పేర్కొన్నారు.




