Moinabad: డయాబెటిస్ బాధితుల్లో కాళ్ల తొలగింపు నివారణే ధ్యేయం!

Moinabad: మొయినాబాద్‌లో ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐపాకాన్ 2026. డయాబెటిక్ పేషెంట్ల కాళ్ల పరిరక్షణే ధ్యేయంగా అవగాహన సదస్సు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 29 Aug 2026 7:13 PM IST
Moinabad
X

Moinabad: డయాబెటిస్ బాధితుల్లో కాళ్ల తొలగింపు నివారణే ధ్యేయం!

Moinabad: ఇండియన్ పోడియాట్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐపాకాన్ 2026.దేశంలో రోజురోజుకు పెరుగుతున్న డయాబెటిక్ పేషంట్ల అప్రమత్తత భద్రత నిమిత్తమై ఇండియన్ పోడియాట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐపాకాన్ 2026 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మొయినాబాద్ లోని ఫైర్ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రీసెర్చ్ లో ప్రారంభించారు. ముఖ్యంగా ఈ ఐపాకాన్ 2026 అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం.

అవయవాల తొలగింపులను నివారించడం, కాళ్ళను కాపాడడం పై ప్రధాన దృష్టి. నివారణ అవయవ పరిరక్షణ పునరుత్పత్తి వైద్యం ద్వారా డయాబెటిక్ ఫుట్ కేర్ కు కొత్త నిర్వచనం అనే దీంతో దేశంలో అతిపెద్ద డయాబెటిక్ ఫుట్ అండ్ లింబు సాల్విజ్ కాంగ్రెస్. దేశంలో ఉన్న డయాబెటిక్ పేషంట్లలో కాలికి చిన్న దెబ్బ తగిలిన దానిని మనం నెగ్లిజెన్సీగా చూస్తామని కానీ అలా చూడకుండా ఇండియన్ పోడియట్రీ అసోసియేషన్ ను కలిసి తగిన నివారణ చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.

ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు ఇతర డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో కాలికి చిన్న గాయమైన దానిని వెంటనే తొలగించాలని వారు సూచిస్తారు కానీ ఇండియన్ పొడియాట్రీ అసోసియేషన్ వారు అలా అవయవాల తొలగింపులను నివారించడానికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఇందులో దేశం మొత్తం మీద 500 మంది డాక్టర్లు ఏకమై దీనిపై అవగాహనను ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో తెలంగాణలో ఇండియన్ పోడియాట్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డయాబెటిక్ కేర్ అనే అంశంపై చర్యలు తీసుకొని అవయవాలను తొలగించే అంశాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.

ప్రపంచంలోనే భారతదేశంలో పెద్ద ఎత్తున డయాబెటిక్ పేషెంట్లు ఉండడం వలన వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై సమీక్షిస్తూ వారు నిర్వహించాల్సిన డైట్ పై పూర్తి అవగాహన ఏర్పరుస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమాని డాక్టర్ కె వి ఎం సంతోష్ మూర్తి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి పి వి రమేష్, తెలంగాణ చాప్టర్ కార్యదర్శి డాక్టర్ రెజినాల్డ్ ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story