Pargi: పరిగి జైలులో యోగా డే.. యోగాసనాలు వేసిన ఖైదీలు!
Pargi: పరిగి సబ్ జైలులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఖైదీలు, సిబ్బంది యోగాసనాలు.
Pargi: పరిగి జైలులో యోగా డే.. యోగాసనాలు వేసిన ఖైదీలు!
PARGI: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పరిగి సబ్ జైలు నందు జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఖైదీలు మరియు సిబ్బందితో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ, పరిగి శాఖ సభ్యులు శ్రీ ఆకారపు రాజు పాల్గొని ఖైదీలు మరియు సిబ్బంది చేత యోగాసనాలు చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిధి మాట్లాడుతూ మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పొందవచ్చు అన్నారు.
యోగాసనాలు శరీరంలోని అన్ని అవయవాలను ఉత్తేజిత పరుస్తాయని అప్పుడు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగే శరీరం రోగాల బారిన పడకుండా ఉంటుందని అన్నారు. జైలులో ఖైదీలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం యోగాసనాలు సాధన చేయడం అభినందనీయమని ఇదే అలవాటును వారు జైలు నుండి విడుదల అయిన తర్వాత కూడా కొనసాగించడం వలన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైలు సిబ్బంది యమ్ డి ఖయ్యుమ్, హరికృష్ణ, ఫయాజ్, యాదగిరి పాల్గొన్నారు.




