Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో ఘనంగా 'ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే'!

Jubilee Hills: జిగ్లీ పెట్ కేర్ సెంటర్‌లో హ్యాపీ పెట్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెట్స్‌కు ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఇచ్చారు.

RAJESH,	WEST ZONE
Published on: 2 Aug 2026 1:48 PM IST
Jubilee Hills
X

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో ఘనంగా 'ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే'!

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే. పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం

భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ పెట్ కేర్ బ్రాండ్ ఆధ్వర్యంలో మూడో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే (IHPD) వేడుకలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వందలాది మంది పెట్ పేరెంట్స్ తమ పెంపుడు శునకాలు, పిల్లులతో పాల్గొని సందడి చేశారు.

పెంపుడు జంతువులు, వాటి యజమానుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, ముందస్తు ఆరోగ్య సంరక్షణ (ప్రోయాక్టివ్ పెట్ హెల్త్‌కేర్)పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లో పెంపుడు జంతువులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, వెటర్నరీ వైద్యుల సలహాలు, వెల్‌నెస్ కన్సల్టేషన్లు, పెట్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పెట్ పేరెంట్స్‌కు అత్యవసర పరిస్థితుల్లో జంతువులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై వెటర్నరీ నిపుణులు అవగాహన కల్పించారు. దేశంలోని 15కి పైగా నగరాల్లోని 35 జిగ్లీ పెట్ కేర్ కేంద్రాల్లో జరిగిన ఈ వేడుకల్లో 2,500కు పైగా పెంపుడు జంతువులు, 3,500 మందికి పైగా పెట్ పేరెంట్స్ పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story