Hyderabad: ఈనెల 31న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా కల్పనా ఇనామ్‌దార్!

Hyderabad: కులగణనలో ఓబీసీ కాలమ్, మహిళా రిజర్వేషన్లలో సబ్‌కోటా డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 31న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద లోక్ ఆందోళన్ న్యాస్ మహాధర్నా.

RAJESH,	WEST ZONE
Published on: 21 Aug 2026 4:05 PM IST
Hyderabad
X

Hyderabad: ఈనెల 31న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా కల్పనా ఇనామ్‌దార్!

Hyderabad: ఇందిరాపార్కు వద్ద ఈ నెల 31న చేపట్టనున్న మహాధర్నాకు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నామని లోక్ ఆందోళన్ న్యాస్ వర్కింగ్ ప్రసి డెంట్ కల్పనా ఇనామ్ దార్ తెలిపారు.

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ జనగణన కులగణనలో ఓబీ సీలకు ప్రత్యేక కాలం ఇవ్వాలని, 33 శాతం మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్కాటా విధించాలని, న్యాయ వ్యవస్థలో సంస్క రణలు తీసుకురావాలని, డి లిమిటేషన్లో రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య న్యాయ ప్రచార ఉద్యమం చేపడుతున్నామన్నారు.

ఇందిరాపార్కు ధర్నాతో తెలంగాణలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాధి శిల్పా, రాఘవలింగం తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story