Kadthal: కడ్తాల్‌లో పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు!

Kadthal: కడ్తాల్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Aug 2026 10:25 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్‌లో పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు!

రంగారెడ్డి జిల్లా ,కడ్తాల్: కడ్తాల్ మండలంలో రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కడ్తాల్ పోలీసులు పట్టుకున్నారు. కడ్తాల్ మండలం ఏక్వయిపల్లి గ్రామంలోని మైసమ్మ ఆలయం సమీపంలో శనివారం (22.08.2026) ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏక్వయిపల్లి గ్రామానికి చెందిన జెనిగల మహేష్ గత కొన్ని నెలలుగా రేషన్ లబ్ధిదారుల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బియ్యాన్ని అశోక్ లేలాండ్ వాహనం TS-34-T-7267లో అమనగల్ వైపు తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు.

అతని వద్ద నుంచి 18 ప్లాస్టిక్ సంచుల్లో సుమారు 8 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యంతో పాటు అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడ్తాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు, విక్రయాలు లేదా తరలింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story