Ibrahimpatnam: భక్తిశ్రద్ధలతో బృందావన్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం బృందావన్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం. పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న భక్తులు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 16 Sept 2026 4:48 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: భక్తిశ్రద్ధలతో బృందావన్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని బృందావన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

బృందావన్ వెల్ఫేర్ అసోసియేషన్ భజన భక్తులు, సభ్యులు, కాలనీవాసులు సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గణనాథుడి ఆశీస్సులు పొందుతున్నారు.

ఈ సందర్భంగా కాలనీలో భక్తి వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు గణేష్ మండపాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM