LB Nagar: హైడ్రా ఉద్యోగాల కోసం భారీగా యువత!

LB Nagar: ఎల్బీనగర్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో హైడ్రా ఉద్యోగాల ఫిజికల్ టెస్టులకు యువత భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 8 Aug 2026 11:16 AM IST
LB Nagar
X

LB Nagar: హైడ్రా ఉద్యోగాల కోసం భారీగా యువత!

LB Nagar: ఎల్బీనగర్‌...: హైడ్రాలో ఉద్యోగాల కోసం యువత భారీగా తరలిరావడంతో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో అభ్యర్థులు స్టేడియం వద్దకు చేరుకుని క్యూలైన్లలో నిల్చున్నారు. సమయం గడిచే కొద్దీ యువత తాకిడి పెరగడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ *(హైడ్రా)*లో 150 పోస్టుల భర్తీకి ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందులో డీఆర్‌ఎఫ్‌ అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్‌ డ్రైవర్లు 50 పోస్టులు ఉన్నాయి.

అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 35 ఏళ్లు కాగా.. విద్యార్హతగా ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత తప్పనిసరి. ఎంపిక ప్రక్రియలో భాగంగా 800 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి సరూర్‌నగర్‌ స్టేడియంలో ఫిజికల్‌ టెస్టులు కొనసాగనున్నాయి. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు, ఫొటోలు తీసుకురావాలని అధికారులు సూచించారు. డ్రైవర్‌ పోస్టులకు హాజరయ్యే వారు ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా తీసుకురావాలి.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story