Hyderabad: తప్పిపోయిన చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

Hyderabad: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కనిపించకుండా పోയ ఆరేళ్ల చిన్నారి అఖిలను పోలీసులు కేవలం 20 నిమిషాల్లోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 28 Aug 2026 4:17 PM IST
Hyderabad
X

Hyderabad: తప్పిపోయిన చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

హైదరాబాద్: వనస్థలిపురం పోలీసులు చూపించిన చొరవతో తప్పిపోయిన ఆరేళ్ల చిన్నారి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సత్యసాయి నగర్‌లో ఆరేళ్ల అఖిల కనిపించకుండా పోయింది. చిన్నారి అదృశ్యమైన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన వనస్థలిపురం పోలీసులు రంగంలోకి దిగి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో కేవలం 20 నిమిషాల్లోనే అఖిలను గుర్తించారు.

అనంతరం చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తక్షణమే స్పందించి చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story