Hyderabad: మల్కాజ్‌గిరిలో ట్రాఫిక్ ఆంక్షలు - ప్రత్యామ్నాయ మార్గాలు

Hyderabad: మల్కాజ్‌గిరి వాజ్‌పేయి నగర్ రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల నేపథ్యంలో నేటి నుంచి ఏడాది పాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలు.

Bodike Manohar, Malkajgiri
Published on: 17 Aug 2026 8:22 PM IST
Hyderabad
X

Hyderabad: మల్కాజ్‌గిరిలో ట్రాఫిక్ ఆంక్షలు - ప్రత్యామ్నాయ మార్గాలు

హైదరాబాద్: వాజ్‌పేయి నగర్ రైల్వే గేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. నిర్మాణ పనుల కారణంగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు తెలిపారు.

నేరెడ్‌మెట్ ఎక్స్‌రోడ్ నుంచి వినాయక్ నగర్ జంక్షన్, సఫీల్‌గూడ వైపు వెళ్లే సాధారణ వాహనాలను అనుమతించరు. వాహనదారులు సైనిక్‌పురి, కెనరా బ్యాంక్ జంక్షన్, ఓల్డ్ సఫీల్‌గూడ, వినాయక్ నగర్ మీదుగా ఆనంద్‌బాగ్ వైపు వెళ్లాలి. ప్రత్యామ్నాయంగా వాయుపురి, కాకతీయ నగర్, నేరెడ్‌మెట్ పాత పోలీస్ స్టేషన్ సర్కిల్, వినాయక్ నగర్ మీదుగా ఆనంద్‌బాగ్ చేరుకోవచ్చు.

అదేవిధంగా సఫీల్‌గూడ, వినాయక్ నగర్ జంక్షన్ల నుంచి నేరెడ్‌మెట్ ఎక్స్‌రోడ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ సఫీల్‌గూడ డీమార్ట్ వైపు మళ్లించనున్నారు. అక్కడి నుంచి కెనరా బ్యాంక్ జంక్షన్, సైనిక్‌పురి మీదుగా నేరెడ్‌మెట్ ఎక్స్‌రోడ్ చేరుకోవచ్చు. మరో ప్రత్యామ్నాయంగా నేరెడ్‌మెట్ పాత పోలీస్ స్టేషన్ సర్కిల్, కాకతీయ నగర్, వాయుపురి మీదుగా నేరెడ్‌మెట్ ఎక్స్‌రోడ్‌కు వెళ్లేలా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నారు.

రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు 1 సంవత్సరం నుంచి 6 నెలల సమయం పట్టనుంది ఈ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story