Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన సాంస్కృతిక యాత్రల ఆసక్తి స్కైస్కానర్

Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులలో సాంస్కృతిక యాత్రలపై ఆసక్తి పెరుగుతోందని స్కైస్కానర్ నివేదిక వెల్లడి. బంజారాహిల్స్‌లో వివరాలు తెలిపిన ప్రతినిధి నీల్ ఘోస్.

RAJESH,	WEST ZONE
Published on: 4 Aug 2026 7:53 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన సాంస్కృతిక యాత్రల ఆసక్తి స్కైస్కానర్

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ప్రయాణించే వారిలో సాంస్కృతిక యాత్రలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోందని స్కైస్కానర్ విడుదల చేసిన ఇండియా కల్చర్ ట్రావెల్ ఇండెక్స్ బంజారాహిల్స్ లో వెల్లడించింది.

ప్రతి ఇద్దరిలో ఒకరు తమ సెలవులను సాంస్కృతిక అనుభవాల చుట్టూ ప్రణాళిక చేసుకుంటుండగా, 80 శాతం మంది ఇటీవలి కాలంలో ఇలాంటి యాత్రలపై ఆసక్తి పెరిగిందని తెలిపారు.

ప్రాంతీయ వంటకాలు (56%), పండుగలు, వేడుకలు (54%), ఆధ్యాత్మిక యాత్రలు (51%) ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని అనుభవించేందుకు యాత్రికులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని స్కైస్కానర్ ప్రతినిధి నీల్ ఘోస్ తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story