Hyderabad: ఆగస్టు 9 నుంచి గ్రాండ్ చెస్ ఫెస్టివల్ డబ్ల్యూజీఎం ప్రత్యూష

Hyderabad: మియాపూర్ శ్రీచైతన్య పాఠశాలలో ఆగష్టు 9 నుండి చెస్ ఫెస్టివల్. రూ. 16.26 లక్షల నగదు బహుమతులు, పోస్టర్ ఆవిష్కరించిన గ్రాండ్ మాస్టర్ ప్రత్యూష.

RAJESH,	WEST ZONE
Published on: 28 July 2026 9:15 PM IST
Hyderabad
X

Hyderabad: ఆగస్టు 9 నుంచి గ్రాండ్ చెస్ ఫెస్టివల్ డబ్ల్యూజీఎం ప్రత్యూష

హైదరాబాద్: ప్రత్యూష ఇంటర్నేషనల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆగష్టు 9 నుండి సెప్టెంబర్ 16 వరకూ నాలుగు దశల్లో చెస్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు ఉమెన్స్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రత్యూష బొద్ద తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చెస్ ఫెస్టివల్ కు సంబందించిన వివరాలను ఆర్జే శేఖర్ భాష, ఆర్జే రాజ్, అకాడమీ డైరెక్టర్ రవితేజలతో కలిసి తెలియజేశారు.

మియాపూర్ లోని శ్రీ చైతన్య ప్యూచర్ పాత్వేస్ గ్లోబర్ స్కూల్స్ లో ఈ చెస్ పెస్టివల్ ను ఘనంగా నిర్వహిస్తున్నామని, 16,26,666 ప్రైజ్ మనీ ని ఈ ఫెస్టివల్లో విన్నర్ లకు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చెస్ ఫెస్టివల్ కు సంబందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ప్రతిరోజూ లక్కీ డ్రా లో గోల్డ్ కాయిన్స్ క్రీడాకారులకు అందిస్తారని, సినిమా సెలబ్రిటీస్ తో..ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నారు.

చిన్నారుల్లో మేధస్సుకు, జ్ఞాపకశక్తికి, సృజనాత్మకతకు చెస్ తోడ్పాటు అందిస్తాయని, తల్లిదండ్రులు పిల్లలకు చెస్ పట్ల ఆసక్తిని పెంచేలా చేయాలని, చెస్ క్రీడను పిల్లలతో ఆడించాలని ఆర్జే శేఖర్ భాష కోరారు. చెస్ ఫెస్టివల్లో క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచి సత్తాచాటాలన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story