Hyderabad: సరూర్ నగర్ స్టేడియంలో హైడ్రా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ
Hyderabad: హైడ్రాలో DRF అసిస్టెంట్లు, డ్రైవర్ పోస్టుల భర్తీకి సరూర్ నగర్ స్టేడియంలో కొనసాగుతున్న ఎంపిక ప్రక్రియ. పోటెత్తిన నిరుద్యోగ యువత.
Hyderabad: సరూర్ నగర్ స్టేడియంలో హైడ్రా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ
హైదరాబాద్: హైడ్రాలో 100 మంది DRF అసిస్టెంటెంట్లతో పాటు 50 మంది డ్రైవర్ ఉద్యోగాల నియామకాన్ని హైడ్రా చేపట్టింది. సరూర్నగర్ స్టేడియంలో శనివారం ఎంపిక ప్రక్రియను హైడ్రా నిర్వహించింది.
వేలాది మంది రావడంతో వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం, ఫిజికల్ టెస్టు కోసం టోకెన్లు జారీ చేయడంలో ఇబ్బంది తలెత్తింది. ఒకేసారి వేలాది మంది ముందుకు రావడానికి ప్రయత్నించగా వారిని నియంత్రించడంలో ఓ అధికారి అసహనానికి గురై పరుషంగా మాట్లాడడం తర్వాత సర్ది చెప్పడం జరిగింది.
యువత కూడా అర్థం చేసుకొని సహకరించడంతో ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది. ఈ నెల 8, 9 తేదీల్లో సరూర్నగర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ ఉంటుందని హైడ్రా ఇదివరకే మీడియా ద్వారా ప్రకటన ఇచ్చింది. దీంతో 3 వేల మందికి పైగా వచ్చారు.
ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా పోలీసుల సహకారంతో అధికారులు నియంత్రించారు. మొదట్లో కాస్త ఇబ్బంది ఎదురైనా అందరి వద్ద దరఖాస్తులు స్వీకరిస్తామని, అందరికీ శారీరక పరీక్షలకు అవకాశం కల్పిస్తామని పదేపదే లౌడ్ స్పీకర్లలో అనౌన్స్ చేయడంతో యువత అర్థం చేసుకొని నియామక ప్రక్రియకు సహకరించింది.




