Hyderabad: నమ్మించి రూ.60 కోట్లకు టోకరా.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
Hyderabad: కుషాయిగూడలో రూ.60 కోట్లు డిపాజిట్లు వసూలు చేసి మోసం చేసిన పబ్బ చంద్రశేఖర్ రంగారెడ్డి కోర్టులో లొంగిపోగా, 14 రోజుల రిమాండ్ విధించారు.
Hyderabad: నమ్మించి రూ.60 కోట్లకు టోకరా.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
హైదరాబాద్:
* నమ్మకమే పెట్టుబడి... రూ.60 కోట్ల టోకరా!
* 30 ఏళ్లుగా స్నేహంతో విశ్వాసం సంపాదించి వంద మందికి మోసం.. ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోయిన పబ్బ చంద్రశేఖర్‌కు 14 రోజుల రిమాండ్
కుషాయిగూడ భగవాన్ కాలనీలో వెలుగుచూసిన భారీ ఆర్థిక మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 30 ఏళ్లుగా స్థానికులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి విశ్వాసాన్ని సంపాదించుకున్న పబ్బ చంద్రశేఖర్, అధిక వడ్డీ ఇస్తానంటూ సుమారు వంద మంది నుంచి రూ.60 కోట్ల మేర డబ్బులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒకరి వద్ద తీసుకున్న డబ్బును మరొకరికి తెలియకుండా వడ్డీ చెల్లిస్తూ నమ్మకం కల్పించిన చంద్రశేఖర్, అనంతరం బాధితుల డబ్బులతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పరారీలో ఉన్న పబ్బ చంద్రశేఖర్ గురువారం రోజున ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోయాడు. విచారణ అనంతరం కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. కేసుకు సంబంధించి పోలీసులు మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




