Hyderabad: కొత్తపేటలో ఘనంగా 'హౌస్ ఆఫ్ షాలికా' స్టోర్ ప్రారంభం!
Hyderabad: హైదరాబాద్ కొత్తపేటలో 'హౌస్ ఆఫ్ షాలికా' ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభమైంది. డాక్టర్ ప్రీతి రెడ్డి, బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ దీనిని ప్రారంభించారు.
Hyderabad: కొత్తపేటలో ఘనంగా 'హౌస్ ఆఫ్ షాలికా' స్టోర్ ప్రారంభం!
ఎల్బీనగర్:
* లగ్జరీ బ్రైడల్ ఫ్యాషన్‌కు కొత్త చిరునామా
* కొత్తపేటలో 'హౌస్ ఆఫ్ షాలికా' ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం
కొత్తపేట... నగరంలో లగ్జరీ బ్రైడల్ ఫ్యాషన్ రంగానికి మరో కొత్త వేదిక అందుబాటులోకి వచ్చింది. బ్రైడల్ కౌట్యూర్, లగ్జరీ ప్రెట్, డిజైనర్ ఎథ్నిక్ వేర్‌కు ప్రసిద్ధి చెందిన హౌస్ ఆఫ్ షాలికా ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను శనివారం కొత్తపేటలో ఘనంగా ప్రారంభించారు.
ద్వారకానగర్‌లోని అష్టలక్ష్మి టెంపుల్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీతి రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ, సామాజిక కార్యకర్త అజితా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్టోర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కలెక్షన్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టోర్‌లో వధువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రైడల్ లెహంగాలు, డిజైనర్ చీరలు, లగ్జరీ ప్రెట్ కలెక్షన్లు, ఫెస్టివ్ వేర్, అకేషన్ వేర్, కస్టమ్ కౌట్యూర్ డిజైన్లు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన వస్త్రాలు, సున్నితమైన హస్తకళా పనితనం, సంప్రదాయ కళను ఆధునిక శైలితో మేళవించి ప్రతి దుస్తును రూపొందించినట్లు పేర్కొన్నారు.
వివాహ వేడుకలు, ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా వ్యక్తిగత అభిరుచులకు తగిన డిజైన్లను రూపొందించే సేవలు కూడా అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్యాషన్ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, నగరవాసులు పాల్గొన్నారు.




