Hyderabad: గోల్కొండ మాస్టర్స్ విజేతగా విశేష్ శర్మ!

Hyderabad: సొంతగడ్డపై జరిగిన తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నీ విజేతగా హైదరాబాద్‌ కు చెందిన 19 ఏళ్ల విశేష్ శర్మ నిలిచాడు. రూ.15 లక్షల ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు.

RAJESH,	WEST ZONE
Published on: 5 Sept 2026 12:58 PM IST
Hyderabad
X

Hyderabad: గోల్కొండ మాస్టర్స్ విజేతగా విశేష్ శర్మ!

Hyderabad: సొంతగడ్డపై జరిగిన తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నమెంట్ను హైదరాబాద్కు చెందిన విశేష్ శర్మ గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో రెండోసారి బరిలోకి దిగిన 19 ఏళ్ల విశేష్ అద్భుత ఆటతో అగ్రస్థానంతో ముగించడం విశేషం. ఓవరాల్గా 21 అండర్ 259 పాయింట్లతో అతను విజేతగా నిలిచాడు. 4 షాట్ అడ్వాంటేజ్తో వచ్చిన విశేష్ 1 అండర్ 69 పాయింట్లు సాధించి టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఈ 69 పాయింట్లలో 7 బర్డీస్, 4 బోగీస్, 1 డబుల్ బోగీ ఉన్నాయి.

ఈ ఈవెంట్కు ముందు ఆర్డర్ ఆఫ్ మెరిట్లో 2026 సీజన్ లో 25వ స్థానంలో ఉన్న అతను 14వ స్థానానికి ఎగబాకి ఇండియా చాంపియన్షిప్స్కు కూడా అర్హత సాధించాడు. విశేశ్ కు రూ.15 లక్షల ప్రైజ్మనీ దక్కింది. ఒక్క స్ట్రోక్ తేడాతో వెనుకబడిన అమర్దిప్ (నోయిడా)కు రెండో స్థానం దక్కింది. అతను 20 అండర్ 260 పాయింట్లు సాధించాడు. 10 అండర్ 60 పాయింట్లతో అక్షయ్ శర్మ (చండీగఢ్)కు మూడో స్థానం దక్కింది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story