Hyderabad: హైదరాబాద్‌లో ఈనెల 4న మాంసం దుకాణాలు బంద్

Hyderabad: హైదరాబాద్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈనెల 4న మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 2 Sept 2026 2:15 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో ఈనెల 4న మాంసం దుకాణాలు బంద్

Hyderabad: హైదరాబాద్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 4న నగరవ్యాప్తంగా అన్ని మాంసం, జీవాల వధశాలలు, దుకాణాలను మూసివేయాలని స్పష్టం చేసింది.

మతపరమైన పండుగలు, జాతీయ దినోత్సవాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మాంస విక్రయాలపై ఆంక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story