Tarnaka: ఉస్మానియా యూనివర్సిటీలో 'జెన్ జీ పోరుబాట' పోస్టర్ ఆవిష్కరణ!
Tarnaka: ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద జెన్ జీ విద్యార్థి సంఘం జెన్ జీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరించింది విద్యార్థుల సమస్యలు తీర్చి నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు
Tarnaka: ఉస్మానియా యూనివర్సిటీలో 'జెన్ జీ పోరుబాట' పోస్టర్ ఆవిష్కరణ!
తార్నాక:
విద్యార్థుల సమస్యల పరిష్కరానికి జెన్ జీ పోరుబాట
ఉస్మానియా యూనివర్సిటీ...
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జెన్ జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద "జెన్ జీ పోరుబాట" గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం ఫౌండర్, ప్రెసిడెంట్ శివాజీ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. శివాజీ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో విద్య హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి అన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్ స్థానంలో బిపిఎల్ ప్రాతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. కార్యక్రమంలో ఆంజనేయులు, సంతోష్, అయోధ్య, ప్రకాష్, ముని, రమేష్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.




