Hyderabad: కొత్త షాపులో పాత మద్యం అమ్మకాలు.. గుట్టురట్టు చేసిన సీఐ
Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని మంజునాథ వైన్స్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వినూత్న తనిఖీలు చేపట్టారు.
Hyderabad: కొత్త షాపులో పాత మద్యం అమ్మకాలు.. గుట్టురట్టు చేసిన సీఐ
Hyderabad: ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మంజునాథ వైన్స్ లో హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ మహేష్ సిబ్బంది కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 2023 -25 మద్యం పాలసీకి చెందిన మద్యం బాటిల్లు అమ్మకాలు జరుపుతున్నట్లుగా గుర్తించారు. మద్యం షాప్ యజమాని ఇంట్లో తనిఖీలు నిర్వహించగా ఇంట్లో 14 రకాల 198 మద్యం బాటిల్లు ను సీజ్ చేశారు. సీజ్ చేసిన మద్యం బాటిళ్లను చిక్కడపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ మహేష్ తెలిపారు.
Next Story




