Hyderabad: గాంధీ భవన్ ముట్టడి యత్నం నాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళనలతో రాజకీయ రణరంగం. గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్.

G. Govind, Medchal
Published on: 22 July 2026 4:04 PM IST
Hyderabad
X

Hyderabad: గాంధీ భవన్ ముట్టడి యత్నం నాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్: గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన రాంచందర్ రావు అరెస్టు నిన్న ప్రధాని ఇంటి వద్ద రాహుల్ గాంధీ ధర్నా చేయడం దేశ ప్రజలను అవమానించేలా ఉందని గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ.

గాంధీ వెళ్ళకుండా అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారీ కేడ్లను దాటుకుని వెళ్ళే ప్రయత్నం చేయగా రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ను, అదే విధంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలతో పాటు అనేకమంది బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.

అరెస్టును నిరసిస్తూ గాంధీ భవన్ ను ముట్టడించిన బీజేవైఎం నేతలు. దీనికి కౌంటర్ గా బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రోహిణ్ రెడ్డిపైకి కర్రలు విసిరిన బీజేపీ నేతలు. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్ళు విసురుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

కాంగ్రెస్, బీజేపీ నేతల దాడి కవరేజీలో ఉన్న మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి.. ఓ ప్రతినిధి తలకు గాయమై తీవ్ర రక్తస్రావం అయింది‌‌. రెండు జాతీయ పార్టీల పోటాపోటీ నిరసనలు, ధర్నాల నేపథ్యంలో నాంపల్లి ప్రాంతమంతా రాజకీయ రణరంగంగా మారింది.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story