Hyderabad: ఈ నెల 17 నుంచి సేవా సంకల్ప అభియాన్ - బీజేపీ ప్రకటన
Hyderabad: హైదరాబాద్‌లో బీజేపీ భాగ్యనగర్ జిల్లా ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ప్రధాని మోదీ సుపరిపాలన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి సేవా సంకల్ప అభియాన్.
Hyderabad: ఈ నెల 17 నుంచి సేవా సంకల్ప అభియాన్ - బీజేపీ ప్రకటన
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని ఉప్పరిగూడలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో.. బీజేపీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించనున్న “సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 25 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భాగ్యనగర్ జిల్లా కేంద్రంలో చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా నాయకులు వెల్లడించారు.




