Qutubullapur: కుత్బుల్లాపూర్‌లో రోడ్ల నిర్మాణం కోసం జోనల్ కమిషనర్‌కు వినతి
Qutubullapur: దూలపల్లి నుంచి జీడిమెట్ల వరకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కుత్బుల్లాపూర్ జెడ్సీ పింకేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు.
Qutubullapur: కుత్బుల్లాపూర్‌లో రోడ్ల నిర్మాణం కోసం జోనల్ కమిషనర్‌కు వినతి
క్కుతుబుల్లాపూర్: గత నెలలో శేఖర్ యాదవ్ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం తో వారు వెంటనే స్పందించి జోనల్ కమిషనర్ కి లేఖ వ్రాశారు.
ఆ యొక్క లేఖను ఈరోజు జెకె శేఖర్ యాదవ్ జిల్లా అధ్యక్షులు OBC మోర్చా ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ కి దూలపల్లి ఎన్టీఆర్ స్టాచ్ నుండి జీడిమెట్లకు వెళ్లే రహదారి ఫేస్ పై సెకండ్ గేట్ వరకు నిత్యం వందలాది వెహికల్స్ రాకపోకలు సాగిస్తూ రోడ్డు పూర్తిగా ద్వాసమైందున చాలామంది ఆక్సిడెంట్ కు గురవుతున్నారు.
కావున వెంటనే రోడ్డు వేయాలని మరియు దూలపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలని వారికి వినతిపత్రం అందివ్వడం జరిగింది ఇందులో ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి అధ్యక్షులు మల్లారెడ్డి గారు పాల్గొని వారు మాట్లాడుతూ కంపెనీలో లక్షల రూపాయలు టాక్స్ వసూలుచేసి కనీస సదుపాయాలు కంపెనీలకు కల్పిస్తలేరు కాబట్టి వెంటనే రోడ్లు డ్రైనేజీ వేయాలని వారన్నారు.
జెడ్ సి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని మన హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఇంచార్జ్ నందనం దివాకర్ నటరాజ్, శివాజీ రాజా, బావిగడ్డ రవి డివిజన్ అధ్యక్షులు కేశవ్ యాదవ్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.




