Hyderabad: గాంధీభవన్‌లో TPCC జనరల్ సెక్రటరీల పనితీరు సమీక్ష
Hyderabad: గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శి సచిన్ సావంత్ సమీక్ష. TPCC జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పనితీరును అభినందించిన వైనం.
Hyderabad: గాంధీభవన్‌లో TPCC జనరల్ సెక్రటరీల పనితీరు సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరును సమీక్షించే క్రమంలో గత రెండు రోజులుగా గాంధీభవన్‌లో టీపీసీసీ జనరల్ సెక్రటరీలతో ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ కార్యదర్శి సచిన్ సావంత్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములుతో సచిన్ సావంత్ వన్ టు వన్‌గా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 14 నెలల కాలంలో 26 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌గా తాను చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి చేసిన కృషిని సీతారాములు వివరించారు.
అలాగే SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) – ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో BLAలు, BLOలు, సూపర్‌వైజర్లను సమన్వయం చేస్తూ చేపట్టిన కార్యక్రమాలు, వాటిని విజయవంతంగా పూర్తి చేసిన తీరును సచిన్ సావంత్‌కు వివరించారు.
ఈ సందర్భంగా నాగా సీతారాములు పనితీరును సచిన్ సావంత్ ప్రత్యేకంగా అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంలో నాగా సీతారాములు కీలకంగా వ్యవహరించాలని సచిన్ సావంత్ పేర్కొన్నారు.




