Hyderabad: వ్యాపార రంగాలను ప్రోత్సహించాలి అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి

Hyderabad: హైదరాబాద్ కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ-కామర్స్ సమ్మిట్. ఎగుమతులు, GeM పోర్టల్‌పై ఉత్పత్తుల నమోదుపై అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి దిశానిర్దేశం.

G. Rama Krishna, Hyderabad
Published on: 29 July 2026 7:23 PM IST
Hyderabad
X

Hyderabad: వ్యాపార రంగాలను ప్రోత్సహించాలి అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి

హైదరాబాద్: జిల్లాలో మెగా ఎగుమతుల ప్రోత్సాహం, ఈ-కామర్స్ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి బుదవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కామర్స్ సమ్మిట్ సమావేశంలో అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాను ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా జిల్లా నుంచి ఎగుమతులను ప్రోత్సహించడం, జిల్లా ఉత్పత్తులను ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM)తో పాటు ఇతర ఈ-కామర్స్ వేదికలపై నమోదు చేయించే అంశాలపై సమావేశంలో చర్చించారు.

స్థానిక పరిశ్రమలు, వ్యాపార సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొని ఎగుమతుల విస్తరణ, ఈ-కామర్స్ వేదికల వినియోగం, ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సహకారం తదితర అంశాలపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు.

ఎగుమతులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని పెంపొందించడం, శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రక్రియలోని అవరోధాలను తొలగించడం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు.

సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గణేష్ రామ్ , లీడ్ బ్యాంక్ మేనేజర్ కార్యాలయం నుంచి ప్రదీప్, డైరెక్టరేట్ జెనరల్ ఆఫ్ ఫారెయిన్ ట్రేడ్ (DGFT), మినిస్ట్రీ అప్ మీడియం స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రెసెస్ (MSME), ఇండియా పోస్ట్ తదితర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad

Next Story