Hayathnagar: నేతాజీ నర్సింగ్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన!
Hayathnagar: పెద్ద అంబర్‌పేట్ నేతాజీ నర్సింగ్ కళాశాల భవనం నుంచి పడి గాయపడిన శ్రావ్యకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
Hayathnagar: నేతాజీ నర్సింగ్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన!
హయత్ నగర్:
బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలి ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆందోళన..
పెద్ద అంబర్‌పేట్‌లోని నేతాజీ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కడారి శ్రావ్యకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గత నెల 12న కళాశాల భవనం నుంచి కిందపడటంతో శ్రావ్య తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం నిమ్స్‌కు తరలించారు.
విద్యార్థిని వైద్య ఖర్చులను భరిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చి అనంతరం పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెద్ద అంబర్‌పేట్‌లోని నేతాజీ నర్సింగ్ కళాశాల వద్ద కుటుంబ సభ్యులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర చారి మాట్లాడుతూ, బాధిత విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కళాశాల యాజమాన్యంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థినిపై ఒత్తిడి లేకుండా చట్టబద్ధంగా స్టేట్‌మెంట్ నమోదు చేయాలని కోరారు.
ఈ ఆందోళనలో సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




