Gachibowli: గచ్చిబౌలిలో వంట మనిషి హత్య!
Gachibowli: హరిహర మెన్స్ హాస్టల్ (గచ్చిబౌలి, అంజయ్య నగర్)లో వంటమనిషి శశిధర్ హత్య. తోటి వంటమనిషి ప్రమోద్ కత్తితో దాడి, సీసీటీవీలో రికార్డు.
Gachibowli: గచ్చిబౌలిలో వంట మనిషి హత్య!
Gachibowli: పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న 'హరిహర మెన్స్ హాస్టల్'లో పనిచేస్తున్న శశిధర్ (43) అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. బాధితుడు శశిధర్, నిందితుడు ప్రమోద్ ఇద్దరూ ఒడిశా రాష్ట్రానికి చెందినవారు.
వీరిద్దరూ హరిహర హాస్టల్‌లోనే వంట మనుషులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో, ఆగ్రహానికి గురైన ప్రమోద్ కత్తితో శశిధర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు.
ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలన్నీ హాస్టల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు గల కారణాలు, ఏ పరిస్థితుల్లో నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.




