Hyderabad: హైటెక్స్‌లో హింటెక్స్ 2026 ప్రారంభం స్వాతి చలమలశెట్టి!
Hyderabad: మాదాపూర్ హైటెక్స్‌లో హింటెక్స్ 2026 ప్రదర్శనను ప్రారంభించిన స్వాతి చలమలశెట్టి. ఆటోమేషన్, ఇంజినీరింగ్ టెక్నాలజీ తయారీ రంగానికి కీలకమని వెల్లడి.
Hyderabad: హైటెక్స్‌లో హింటెక్స్ 2026 ప్రారంభం స్వాతి చలమలశెట్టి!
Hyderabad: ఆటోమెషన్, డిజిటలైజేషన్, అధునాతన ఇంజినీరింగ్ టెక్నాలజీ తయారీ రంగం అత్యంత కీలకమని ఏస్ అర్బన్ గ్రూప్, ఏఎం గ్రీన్ డైరె క్టర్ స్వాతి చలమలశెట్టి అన్నారు. మాదాపూర్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన హింటెక్స్ (హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషిన్ టూల్ అండ్ ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్) 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏస్ అర్బన్ గ్రూప్, ఏఎం గ్రీన్ డైరెక్టర్ స్వాతి చలమలశెట్టి విచ్చేసి హైటెక్స్ డైరెక్టర్ కునశంకర్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హింటెక్స్ వంటి పారిశ్రామిక ప్రదర్శనలు ఆధునిక సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు చేరువ చేయడంతో పాటు, సంస్థలు తమ అవసరాలకు అనుగుణమైన సాంకేతిక పరిష్కారాలను అన్వేషించేందుకు కీలకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. హింటెక్స్ గత కొన్నేళ్లుగా దేశంలోని అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రదర్శనల్లో ఒకటిగా ఎదిగినట్లు తెలిపారు.
మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో హింటెక్స్ లేథ్, సీఎన్సీ యంత్రాలు, మ్యాచినింగ్ సెంటర్లు, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మెషిన్లు, మైడ్రాలిక్, మెకానికల్, న్యూమాటిక్ ప్రెస్లు, షీరింగ్, బెండింగ్ ప్రెస్లు, మెటల్ ఫార్మింగ్ మెషిన్ టూల్స్, డ్రిల్లింగ్, బోరింగ్ వంటి యంత్ర పరికరాలను ప్రదర్శించారు.




