Boduppal: ఐక్యతను చాటిన హిందూ మహా సమ్మేళనం: బోడుప్పల్‌లో సందడి!
Boduppal: మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో ఘనంగా జరిగిన హిందూ మహా సమ్మేళనం.
Boduppal: ఐక్యతను చాటిన హిందూ మహా సమ్మేళనం: బోడుప్పల్‌లో సందడి!
ఉప్పల్: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లోని గాయత్రి నగర్‌లో హిందూ సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మన సంస్కృతి, సనాతన ధర్మం, సంప్రదాయ విలువలను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ మహా సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ హరికథ విద్వాంసులు ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి, చిన్నం రాజు, పి. లలితా వాణి హాజరై సాంస్కృతిక విలువలు, సమాజ ఐక్యత ప్రాధాన్యతపై ప్రసంగించారు. వారి ఉపన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి మాట్లాడుతూ, హిందూ ధర్మానికి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరూ ఒకే గళంగా, ఒకే శక్తిగా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. హిందుత్వ మహోన్నత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, హరికథలతో సమ్మేళనం మరింత వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమం ద్వారా సనాతన ధర్మంపై అవగాహన పెంపొందడంతో పాటు సమాజంలో ఐక్యతకు బాటలు వేయాలనే సందేశం అందించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, వివిధ కాలనీల స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.




