Hayathnagar: హయత్‌నగర్‌లో కాంగ్రెస్ ధర్నా: రాహుల్ అరెస్ట్‌పై నిరసన!
Hayathnagar: రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా హయత్‌నగర్‌లో చెనగొని రవీందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ధర్నా. కేంద్ర వైఖరిపై మండిపడుతూ మోదీ రాజీనామాకు డిమాండ్.
Hayathnagar: హయత్‌నగర్‌లో కాంగ్రెస్ ధర్నా: రాహుల్ అరెస్ట్‌పై నిరసన!
హయత్ నగర్: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పిలుపు మేరకు హయత్ నగర్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి.హయత్ నగర్ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుడు చెనగొని రవీందర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా చెనగొని రవీందర్ మాట్లాడుతూ... కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కుట్రలు చేస్తోంది.
రాహుల్ గాంధీ అరెస్ట్ ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడుతోంది అని మండిపడ్డారు.
దేశంలో నెలకొన్న సమస్యలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.




