Hayathnagar: పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన: జీవో 97 రద్దు చేయాలి!

Hayathnagar: హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ, జీవో 97 రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

AJAY, HAYATH NAGAR
Updated on: 20 Aug 2026 3:37 PM IST
Hayathnagar
X

Hayathnagar: పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన: జీవో 97 రద్దు చేయాలి!

Hayathnagar: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఉద్రిక్త ఆందోళన చేపట్టారు.రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

​సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు బలాత్కారంగా వారిని పక్కకు లాగివేసి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు నడుమ తీవ్ర తోపులాట జరిగి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి అబ్దుల్లా పూర్ మెట్ సీఐ విద్యార్థుల పై ఆకరణంగా దాడి చేసి గాయపరిచ్చారని ఆరోపించారు.

​విద్యార్థుల ధర్నా, పోలీసుల జోక్యంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. జీవో 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story