Hayathnagar: విద్యతో పాటు క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రిన్సిపాల్ సురేష్ బాబు!

Hayathnagar: హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 'ఖేలో ఇండియా సంవాద్' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

AJAY, HAYATH NAGAR
Published on: 27 Aug 2026 6:50 PM IST
Hayathnagar
X

Hayathnagar: విద్యతో పాటు క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రిన్సిపాల్ సురేష్ బాబు!

హయత్‌నగర్: నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ‘ఖేలో ఇండియా సంవాద్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు డిజిటల్ స్క్రీన్‌పై వీక్షించారు. అనంతరం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు మాట్లాడుతూ.. క్రీడల ద్వారా విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారని, విద్యతో పాటు క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అనఘా పై మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే తనకు క్రీడలపై ఆసక్తి ఉండేదని, బ్యాడ్మింటన్‌పై ఉన్న ప్రత్యేక ఆసక్తితో ఆ క్రీడను ఎంచుకున్నానని తెలిపారు. వివిధ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థినీ విద్యార్థులు క్రీడలపై ఆసక్తిని పెంచుకుని తమకు నచ్చిన క్రీడలో నిరంతరం సాధన చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అనఘా పై సూచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన క్రీడా అవకాశాలకు సంబంధించిన వివిధ ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్ రెడ్డి, ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. డి. మధు, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా. ఇ. యాదగిరి రెడ్డి, డా. ఎస్. శారదా దేవి, ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story