Hayathnagar: హయత్‌నగర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థికి ప్రభుత్వ కొలువు!
Hayathnagar: హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థి ఇస్లావత్ హనుమంతు టీఎస్‌ఆర్టీసీలో అసిస్టెంట్ మెకానిక్ ఉద్యోగం సాధించడంతో ప్రిన్సిపాల్ అభినందించారు.
Hayathnagar: హయత్‌నగర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థికి ప్రభుత్వ కొలువు!
Hayathnagar: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హయత్‌నగర్‌లో బీకాం ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన ఇస్లావత్ హనుమంతు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో అసిస్టెంట్ మెకానిక్ (శ్రామిక్) పోస్టుకు ఎంపికై ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు.
ఈ విషయాన్ని కళాశాల కెరీర్ గైడెన్స్ & ప్లేస్‌మెంట్ ఇన్‌చార్జ్ డా. ఎ. దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. పి. సురేష్ బాబు హనుమంతును అభినందించారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. హనుమంతు సాధించిన విజయం కళాశాలలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అనంతరం వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, IQAC ఇన్‌చార్జ్ డా. మధు, కామర్స్ విభాగాధిపతి డా. పి. రమాదేవి, డా. శారదాదేవి, డా. బాల, తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ ఇన్‌చార్జ్ డా. మక్ల తదితర అధ్యాపకులు ఇస్లావత్ హనుమంతును అభినందించి సన్మానించారు.
ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన ఇస్లావత్ హనుమంతుకు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది హృదయపూర్వక అభినందనలు తెలిపారు.




