Hayathnagar: బీజేపీ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి..నవజీవన్ రెడ్డి!

Hayathnagar: బీజేపీ ఆఫీసుపై దాడిని నిరసిస్తూ ట్యాంక్‌బండ్ ధర్నాకు బయలుదేరిన హయత్‌నగర్ బీజేపీ నేతల హౌస్ అరెస్ట్. కళ్లెం నవజీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.

AJAY, HAYATH NAGAR
Published on: 1 Sept 2026 12:04 PM IST
Hayathnagar
X

Hayathnagar: బీజేపీ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి..నవజీవన్ రెడ్డి!

Hayathnagar: బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి నలుపు రంగు పూయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక దాడులకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీ అసహనానికి నిదర్శనమని విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి హాజరుకాకుండా అడ్డుకునేందుకు హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్యాలయంపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనన్నారు. దాడులు, నిర్బంధాలతో బీజేపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరని అన్నారు.

శాంతియుతంగా నిరసన తెలిపే తమ ప్రజాస్వామ్య హక్కును అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని పేర్కొన్నారు. హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన తమ పోరాటాన్ని ఆపలేరని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, హయత్‌నగర్ మరియు హైకోర్ట్ కాలనీ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, తుర్కయంజాల్ మరియు తొర్రూర్ డివిజన్ అధ్యక్షులు అలిమినేటి నర్సింహా రెడ్డి, జిల్లా SC మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, జిల్లా SC మోర్చా కార్యదర్శి శక్తి సింగ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇట్టబోయిన నర్సింహా,

డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చారి, నాయకులు వస్పరి వెంకటేష్, లక్ష్మణ్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ నాయకులు రాం రెడ్డి, బ్లదేవ్ రెడ్డి, బాల మల్లేష్, శ్రీనివాస్, రంగా రెడ్డి బీజేవైఎం నాయకులు ఎర్ర ప్రేమ్, భరత్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story