Hayathnagar: హయత్‌నగర్‌లో దారుణం రెండు నెలల పసికందు విక్రయం కలకలం!

Hayathnagar: హైదరాబాద్ హయత్‌నగర్‌లో రెండు నెలల పసికందు విక్రయం కలకలం. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.

AJAY, HAYATH NAGAR
Published on: 27 Aug 2026 12:47 PM IST
Hayathnagar
X

Hayathnagar: హయత్‌నగర్‌లో దారుణం రెండు నెలల పసికందు విక్రయం కలకలం!

Hayathnagar: పసికందు విక్రయానికి సంబంధించిన ఘటన హయత్‌నగర్‌లో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పసికందు తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.

హయత్‌నగర్‌లోని కళానగర్‌కు చెందిన రమేష్, రేణుక దంపతులకు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు రెండు నెలల క్రితం ఆడపిల్ల జన్మించినట్లు తెలిసింది. రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో పసికందును విక్రయించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

అయితే పసికందును ఎవరికి, ఎక్కడ విక్రయించారు? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story