Hasmathpet: అల్వాల్ హస్మత్‌పేట్‌లో హైడ్రా కూల్చివేతలు.. బాధితులకు అండగా ఎంపీ ఈటల రాజేందర్!
Hasmathpet: బోయిన్‌పల్లి హస్మత్‌పేట్‌లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hasmathpet: అల్వాల్ హస్మత్‌పేట్‌లో హైడ్రా కూల్చివేతలు.. బాధితులకు అండగా ఎంపీ ఈటల రాజేందర్!
బోయిన్‌పల్లి / అల్వాల్: బోయిన్పల్లి అస్మత్ పెట్ పురావ శాఖ ప్రభుత్వ స్థలం అంటూ ఫిర్యాదులు వెళ్లడంతో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేంద్ర పేద ప్రజలకు అండగా ఉంటానని స్థలంలో తిరిగి పేద ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వంతో పోరాడుతామని పేద ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ మొండి వైఖరిని మార్చుకోకపోతే పేద ప్రజలను ఏకం చేసి ప్రభుత్వం కూల్చే విధంగా చేస్తామని ఈటెల రాజేంద్ర హెచ్చరించారు.
అక్రమార్కుల జాడ వెతికి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేద ప్రజల ఇండ్లను కూల్చివేయకుండా వారి గూడును చదరగొట్టొద్దని ఎంపీ ఈటల రాజేంద్ర సూచించారు. ప్రభుత్వ స్థలాలని తెలిసి పేద ప్రజలు మరోసారి మోసపోకూడదని కంటోన్మెంట్ ఎన్ఐఎంహెచ్ ఎదురుగా ఉన్న స్థలం ప్రభుత్వ స్థలం అని పేద ప్రజలకు ఒక న్యాయం డబ్బున్నవారికి మరో న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కేవలం పేద ప్రజలపై కొరడా జరిపించడం సరికాదని ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకొని వారికి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని విటల్ రాజేంద్ర కోరారు.




