Hyderabad: పట్నం మహేందర్ రెడ్డి తల్లి మృతి హరీశ్ రావు పరామర్శ
Hyderabad: పట్నం మహేందర్ రెడ్డి తల్లి రుక్మమ్మ మృతికి ఎమ్మెల్యే హరీశ్ రావు నివాళి. నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ నేతలు.
Hyderabad: పట్నం మహేందర్ రెడ్డి తల్లి మృతి హరీశ్ రావు పరామర్శ
హైదరాబాద్: పట్నం మహేందర్ రెడ్డి తల్లి రుక్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి నివాసానికి చేరుకున్న హరీశ్ రావు, రుక్మమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
అనంతరం పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి తన అండ ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు సత్యవతి రాథోడ్,సబితా ఇంద్రారెడ్డి, ఆనంద్, శ్రీనివాస్ గౌడ్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story




