Hythabad: ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే!

Hythabad: హైతాబాద్‌లో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, నాయకులతో కలిసి ర్యాలీని విజయవంతం చేశారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 12 Aug 2026 1:58 PM IST
Hythabad
X

Hythabad: ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే!

Hythabad: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైతాబాద్ గ్రామంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే శ్రీ కె.ఎస్. రత్నం గారు పాల్గొన్నారు.

అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీశైలం గారు, తిరంగా ర్యాలీ అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ నందకిషోర్ గారు పాల్గొని విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలకు ప్రోత్సాహం అందించారు.

దేశభక్తి నినాదాలతో విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండా గొప్పతనాన్ని చాటారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ బీజేవైఎం కార్యవర్గ సభ్యులు కూతురు మహేందర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు లింగాల మహేందర్, మాజీ మండల అధ్యక్షులు కిరణ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దాదే హరీష్, శక్తి కేంద్రం ఇంచార్జ్ కృష్ణాచారి, గూడెం రమేష్, శక్తి కేంద్రం ఇంచార్జ్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు నవీన్, బూత్ అధ్యక్షులు శివారెడ్డి, బర్ల శ్రీకాంత్, మాజీ బూత్ అధ్యక్షులు యాది రెడ్డి, జగదీశ్, శంకర్, శేఖర్, ఉపేంద్ర, వివేక్, ఆమరేష్, రాఘవాచారి, సురేష్, సుధా శివ తదితరులు పాల్గొన్నారు.

అలాగే ZPHS హైతాబాద్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story