Boduppal: మారుతీ నినాదంతో దద్దరిల్లిన బోడుప్పల్.. గాయత్రి మాత గుడిలో పూనకాలు!
Boduppal: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్‌లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Boduppal: మారుతీ నినాదంతో దద్దరిల్లిన బోడుప్పల్.. గాయత్రి మాత గుడిలో పూనకాలు!
ఉప్పల్: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్ లోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల సుధాకర్, జనరల్ సెక్రెటరీ నందకుమార్ జోషి ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వైశాఖ బహుళ దశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని అలంకరించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు ఏకకంఠంతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పరిసర ప్రాంతమంతా భక్తిమయ వాతావరణంలో మునిగిపోయింది. అనంతరం అర్చకులు స్వామివారికి మంగళహారతులు సమర్పించి, భక్తులకు సింధూర తిలకం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువతతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




