Uppal: ఉప్పల్ శిల్పారామంలో హ్యాండ్లూమ్ ఎక్స్‌పో ప్రారంభం!

Uppal: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో పది రోజుల పాటు హ్యాండ్లూమ్ ఎక్స్‌పో ప్రారంభం.

KARUNAKAR, UPPAL
Published on: 2 Aug 2026 9:44 AM IST
Uppal
X

Uppal: ఉప్పల్ శిల్పారామంలో హ్యాండ్లూమ్ ఎక్స్‌పో ప్రారంభం!

Uppal: జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్లూమ్ డే) సందర్భంగా ఉప్పల్ మినీ శిల్పారామంలో శనివారం నుంచి పది రోజుల పాటు నిర్వహించనున్న హ్యాండ్లూమ్ ఎక్స్‌పోను శిల్పారామం జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, చీఫ్ ఇంజనీర్ లింగయ్య, ఇంజనీర్ వినోద్ సంయుక్తంగా ఘనంగా ప్రారంభించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ముఖ్యంగా మహిళల కోసం నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోకు తొలి రోజే విశేష స్పందన లభించింది.

దళారుల ప్రమేయం లేకుండా చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించడంతో పాటు, వారి కళను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఎక్స్‌పోను ఏర్పాటు చేశారు. ఎక్స్‌పోలో పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, బనారసీ చీరలు, కలంకారీ వస్త్రాలు, లేస్ వర్క్, బ్లాక్ ప్రింటింగ్ ఉత్పత్తులు తదితర ప్రత్యేక చేనేత, హస్తకళా వస్తువులు సందర్శకులకు అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా అంబరీష్ లాహంకార్ ఆధ్వర్యంలోని డా. తాషా డ్రమ్స్ బృందం ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వగా, తరంగిణి శిష్యబృందం అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించింది.

ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, చీఫ్ ఇంజనీర్ లింగయ్య, ఇంజనీర్ వినోద్ మాట్లాడుతూ చేనేత కళాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి కళాకారులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రానున్న పది రోజుల పాటు కొనుగోలుదారులు నాణ్యమైన చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులను సరసమైన ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని ఈ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో కల్పించనుంది.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story