Hyderabad: తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడు గల్లంతు అధికారుల నిర్లక్ష్యం
Hyderabad: హఫీజ్‌పేట్ డివిజన్‌లో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి బాలయ్య (70) గల్లంతు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పరిహారం డిమాండ్ చేసిన రవికుమార్ యాదవ్.
Hyderabad: తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడు గల్లంతు అధికారుల నిర్లక్ష్యం
హైదరాబాద్: హఫీజ్ పేట్ డివిజన్, వైశాలి నగర్ , ప్రేమ్ నగర్ బి బ్లాక్ మధ్య గల రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నూతన నాల పైప్ లైన్ పనుల నిమిత్తం తీసిన నాలా వద్ద కనీస భద్రత సూచనలు, బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో మ్యాన్ హోల్ తెరిచి ఉండడంతో నిన్న రాత్రి ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన బాలయ్య (70) గారు కొట్టుకుపోయారని తెలియగా వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, ప్రభుత్వం, సిఎంసి అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి నష్ట పరిహారం అందజేసి, శాశ్వత పరిష్కారం దిశగా నాలా పనులు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదం జరిగి దాదాపు 15 గంటలు కావస్తున్న ఇంతవరకు ఆచూకీ కనుక్కోలేక పోవడం బాధాకరమని, బాధిత కుటుంబం బాధ వర్ణనాతీతమన్నారు, ఈ ప్రమాదం కేవలం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని, 99 రోజుల ప్రజా పాలన , ప్రగతి పాలన అని ప్రచారాలు చేసుకుని అప్పుడు పనులు చేయకుండా ఇప్పుడు వర్షాకాలం కాలం ప్రారంభం అయ్యాక పనులు చేపట్టడం.
ఆమోదయోగ్యమైన విషయం కాదని, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బోర్డులు ఏర్పాటు చేయకుండా మ్యాన్ హోల్ తెరిచి ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు, అసలు అధికారులకు ఎప్పుడూ అప్పటికప్పుడు సమస్యను పక్కదారి మళ్ళించే పనులు చేస్తున్నారని , హఫీజ్ పేట్ నుండి మళ్లించిన నాలా వల్ల ప్రేమ్ నగర్ వాసుల బోర్ వాటర్ కలుషితమై విష జ్వరాల పాలవుతున్నారు.
మొదట పనులు అక్కడి నుండి ప్రారంభించి నాలా పనులను పూర్తి చేయకుండా కేవలం కొంత మేర తాత్కాలికంగా పనులు చేపట్టడం సరైంది కాదన్నారు, ప్రభుత్వం, సిఎంసి అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి నష్ట పరిహారం అందజేసి, శాశ్వత పరిష్కారం దిశగా నాలా పనులు చేపట్టాలని అధికారులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో రాజు, రామ్ రెడ్డి, రెహమాన్, శంకర్,సత్య, విజయ్, మహేష్, ఏడుకొండలు, రాజు, ఇస్మాయిల్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.




