Hayathnagar: ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ!

Hayathnagar: ఆషాఢ మాస పౌర్ణమి నాడు ఘనంగా జరుపుకునే గురు పౌర్ణమి విశిష్టత మరియు హయత్ నగర్ సాయిబాబా ఆలయంలో భక్తుల సందడిపై ప్రత్యేక కథనం.

AJAY, HAYATH NAGAR
Published on: 29 July 2026 11:25 AM IST
Hayathnagar
X

Hayathnagar: ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ!

Hayathnagar: హయత్ నగర్ లో ఉన్నటువంటి సాయిబాబా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో గురు పౌర్ణమి సందర్భంగా పాల్గొన్నారు

ఈ రోజున మనకు జ్ఞానాన్ని అందించిన గురువులను స్మరించి, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. మహర్షి వేదవ్యాసుడు జన్మించిన రోజు కావడంతో ఈ రోజును వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

గురువు అనేది కేవలం విద్యను బోధించే వ్యక్తి మాత్రమే కాదు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించే దైవ స్వరూపం. అందుకే "గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః" అని శాస్త్రాలు గురువును త్రిమూర్తుల స్వరూపంగా వర్ణిస్తాయి.

గురు పౌర్ణమి రోజున భక్తులు తమ గురువులను దర్శించి ఆశీర్వాదాలు పొందుతారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తారు. గురువుల పాదపూజ చేసి, వారి ఆశీస్సులు పొందడం ద్వారా జీవితంలో జ్ఞానం, సద్బుద్ధి, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

ఈ పవిత్ర దినాన ప్రతి ఒక్కరూ తమ జీవితానికి మార్గదర్శకులైన గురువులను స్మరించి, వారి బోధనలను ఆచరణలో పెట్టాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. గురువు చూపిన ధర్మమార్గమే జీవిత విజయానికి, శాంతికి, సుఖసంతోషాలకు పునాది అని పేర్కొంటున్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story