Dilsukhnagar: సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు కిక్కిరిసిన భక్తజనం

Dilsukhnagar: దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు.

RAHUL, MEERPET
Published on: 29 July 2026 11:25 AM IST
Dilsukhnagar
X

Dilsukhnagar: సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు కిక్కిరిసిన భక్తజనం

హైదరాబాద్ :- దక్షిణ షిరిడిగా ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి.

గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

గురుపౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

సాయినాథుడికి ప్రత్యేక అలంకరణలు, మహాభిషేకం, హారతులు, వేదమంత్రోచ్చారణల మధ్య విశేష పూజలు నిర్వహించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు బాబా ఆశీస్సులు పొందేందుకు బారులు తీరారు.

ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా ఆలయం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story