Yacharam: గ్రీన్ ఫార్మసిటీ నిర్వాసితులకు ప్లాట్ల పట్టాల పంపిణీ

Yacharam: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గ్రీన్ ఫార్మసిటీ భూ నిర్వాసితులకు ప్లాట్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి. 387 మంది రైతులకు లబ్ధి.

RAVI, IBRHAMIPATNAM
Published on: 11 Aug 2026 11:04 PM IST
Yacharam
X

Yacharam: గ్రీన్ ఫార్మసిటీ నిర్వాసితులకు ప్లాట్ల పట్టాల పంపిణీ

యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాడిపర్తి,కురుమిద్ద,నానక్ నగర్,మేడిపల్లి. గ్రామాలలో భూములు కోల్పోయిన రైతులకు పట్టాల పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.

గ్రీన్ ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన 387 మంది రైతులకు ప్లాట్ల పట్టాల డాక్యుమెంట్లు ఆర్డిఓ సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతులను జైల్లో పెట్టి ఫార్మాసిటీ అనే ఒక విషపూరితమైన కంపెనీని కోసం భూసేకరణ బలవంతపు భూసేకరణ చేసి రైతులకు 8 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు.

ఎన్నికలలో భాగంగా పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఎకరాకు 121 గజాల ప్లాట్లను రైతులకు అందజేయడం జరిగిందన్నారు.

గత ప్రభుత్వ అధికారులు అప్పటి టిఆర్ఎస్ నాయకులు దళారీలకు భూమి లేకున్నా పరిహారం ఇవ్వడం జరిగిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రైతులకు మాత్రమే పట్టా ప్లాట్ల పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే రంగారెడ్డి తెలి

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story