Shabad: షాబాద్‌లో వైభవంగా 39వ సంవత్సర బడా గణేష్ ఉత్సవాలు!

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమైన బడా గణేష్ ఉత్సవాలు. గత 39 ఏళ్లుగా నిరవిఘ్నంగా కొనసాగుతున్న వేడుకలు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 15 Sept 2026 4:45 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో వైభవంగా 39వ సంవత్సర బడా గణేష్ ఉత్సవాలు!

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో బడా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 39 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు నిరవిఘ్నంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు ఈసారి కూడా ఘనంగా ఏర్పాట్లు చేశారు.

వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణనాథుడిని ప్రతిష్ఠించి, తొలి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

విఘ్నాలను తొలగించి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని గణనాథుడిని భక్తులు వేడుకున్నారు. 39 ఏళ్లుగా కొనసాగుతున్న బడా గణేష్ ఉత్సవాలు షాబాద్ ప్రాంతంలో భక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రజలందరూ ఉత్సవాల్లో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA