Secunderabad: సికింద్రాబాద్ వైఎంసీఏలో ఘనంగా సర్ జార్జ్ విలియమ్స్ జయంతి
Secunderabad: సికింద్రాబాద్ వైఎంసీఏ (YMCA) ఫౌండర్ సర్ జార్జ్ విలియమ్స్ 182వ జన్మదిన వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొన్నారు.
Secunderabad: సికింద్రాబాద్ వైఎంసీఏలో ఘనంగా సర్ జార్జ్ విలియమ్స్ జయంతి
సికింద్రాబాద్: సమాజంలో అణిచి వేయబడి అబాగ్యులుగా మారి నిల్వ నీడ, జీవనోపాధి లేకుండా రోడ్ల మీద, ఫుట్ పాత్స్ పై ఉన్నంత కాలం పాలకులకు ప్రశ్నగానే ఉంటుందని ప్రభుత్వ విప్ హైదరాబాద్ ఏం ఎల్ సి అద్దంకి దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు..
సికింద్రాబాద్ వై ఏం సి ఏ లో జరిగిన ఆ సంస్థ ఫౌండర్ సర్ జార్జ్ విలియమ్స్ 182 వ జన్మదినం సందర్బంగా వై ఏం సి ఏ లో ఏర్పాటు చేసిన వేడుకలకు ఏం ఎల్ సి దయాకర్ ఆయన సతీమణి నాగమణి తో కలిసి పాల్గొన్నారు..
వై ఏం సి ఏ ఫౌండర్ సర్ జార్జ్ విలియమ్స్ ఆశయాలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ వై ఏం సి ఏ ప్రసిడెండ్ జయాకర్ డానీయల్ విలియమ్స్ జన్మదిన వేడుకలకు రోడ్డు పై నిల్వ నిడలేని అబాగ్యులను పిలిచి వారి మంచి చెడులను కనుకొని అన్నదానం చేయడం అందుకు నేను రావడం సంతోషంగా ఉందన్నారు దయాకర్..
ఏదో ఓ కారణం చేత మనస్సు ఛిద్రమై కుటుంబాలతో విడిపోయి రోడ్డు పై ఏలాంటి ఆదారం లేకుండా వంటరి జీవితం గడుపుతున్న వారిని చూస్తుంటే మన రాష్ట్రలు దేశం ఎంత అభివృద్ధి చెందినా అది పాలకులకు ప్రశ్నగానే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి వారిని హక్కున చేర్చుకొని ప్రభుత్వాలు వారికి ఉపాధి తోపాటు నివాసం కల్పించాలని,నేను కూడా తనంతుగా నా ఏం ఎల్ సి పండ్స్ నుండి వీరి కావాల్సిన సెల్టర్స్ తోపాటు మౌలిక వసతులు కల్పించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తానని దయాకర్ స్పష్టం చేశారు.




